పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఫేక్ వార్త ప్రచారంతో ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి ఫోటోలు, వీడియోలను ఇప్పుడు కొందరు వైరల్ చేశారు.
మరోవైపు ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించడం పట్ల పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ను వారు టార్గెట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది.