పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఫేక్ వార్త ప్రచారంతో ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్…