Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాకిస్థాన్‌లో మరోసారి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతేడాది అక్టోబర్‌లో కూడా విద్యుత్‌కు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. ప్రజలంతా అంధకారంలో గడపాల్సి రావడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టోజీలో హెచ్చుతగ్గుల కారణంగా పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్‌కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
సోమవారం విద్యుత్ అంతరాయం కారణంగా ప్రజలకు తలెత్తిన అసౌకర్యానికి ప్రభుత్వం తరఫున ఆయన విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యుత్ వైఫల్యానికి గల కారణాలపై విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం మంగళవారం కూడా అంధకారంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంతరాయానికి గల కారణాలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గ్రిడ్ స్టేషన్లలో మంగళవారం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పాక్ ఇంధన మంత్రి వెల్లడించారు.
On behalf of my government, I would like to express my sincere regrets for the inconvenience our citizens suffered due to power outage yesterday. On my orders an inquiry is underway to determine reasons of the power failure. Responsibility will be fixed.
— Shehbaz Sharif (@CMShehbaz) January 24, 2023
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!