Pakistan-Afghan War: ఒక్క ‘‘రేఖ’’ పాక్ – ఆఫ్ఘాన్ యుద్ధానికి కారణం.. అసలేంటి ‘‘డ్యూరాండ్ లైన్’’..
- పాక్ ఆఫ్ఘాన్ యుద్ధానికి కేంద్రంగా ‘‘డ్యూరాండ్ లైన్’’..
- శతాబ్ధానికి పైగా రగులుతున్న సమస్య..
- రెండు దేశాల మధ్య చారిత్రక, భౌగోళిక వివాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. శుక్రవారం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ సహా కాందహార్, పక్తియా నగరాలపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. మరోవైపు, తాలిబాన్లు కూడా పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులు నిర్వహించారు. ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ సహా నాలుగు ప్రాంతాలపై డ్రోన్ అటాక్ చేసింది. తాము పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు తాలిబాన్లు తెలిపారు. ఈ ఘర్షణపై రష్యా, చైనా, టర్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తల్ని తగ్గించుకోవాలని సూచించాయి. శతాబ్ధ కాలంగా ఈ రెండు దేశాల మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంది.
‘‘డ్యూరాండ్ లైన్’’ సమస్యకు కేంద్రం..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్‌తో సత్కారం
- Modi-Meloni: హైలెట్‌గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
అయితే, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ మధ్య వివాదం నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. ఈ వివాదానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. రెండు దేశాల సరిహద్దు రేఖ ‘‘ డ్యూరాండ్ లైన్’’ సమస్యకు మూలకారణం. సుమారు 2,640 కి.మీ (1,640 మైళ్ళు) విస్తరించి ఉన్న డ్యూరాండ్ రేఖ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ , ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పడింది. ఈ రేఖ బ్రిటీష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును నిర్వచించింది. అయితే, ఈ రేఖ సరిహద్దుల్లో ఉన్న పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది.
1893 నాటి డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. తమ పష్టూన్ల తెగకు చెందిన వారు, పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు చెందుతుందని తాలిబాన్లతో సహా, మునుపటి ఆఫ్ఘాన్ పాలకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ దీనిని ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే పాక్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు ప్రజలు తమను తాము పాకిస్తానీయులుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ‘‘పాక్ తాలిబాన్లు’’ పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు.
భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత:
డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్‌లో ఒక రేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా మిగిలింది. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని చెబుతోంది. ఇటు ఆఫ్ఘాన్ మాత్రం తమకు జరిగిన అన్యాయమని వాదిస్తోంది. తరుచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘాన్-పాక్ సైనిక దళాలు కాల్పులకు తెగబడుతుంటాయి. అరేబియా సముద్రంలోకి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్‌తో పాటు పష్టూన్ భూభాగాలను తిరిగి ఇవ్వాలని ఆఫ్ఘాన్ కోరుతోంది. 2017లో సరిహద్దు వద్ద పాకిస్తాన్ కంచె నిర్మించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!