Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ (శనివారం) పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, ట్రంప్ ర్యాలీ కోసం మోంటానాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని సాంకేతిక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.. దాని కారణంగా అతని విమానం రాకీ పర్వతాలకు అవతలి వైపు ఉన్న ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయబడింది అన్నారు.
Read Also: YVS Chowdary : ఎన్టీఆర్ పక్కన తెలుగమ్మాయి వీణా రావు.. వెండితెరకు పరిచయం చేస్తున్న వైవీఎస్ చౌదరి
కాగా, గత నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా.. అతడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెవికి గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. అది జరిగిన కొద్దీ రోజులకే మరో ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ ఈ ఎన్నికల్లో ముఖాముఖిగా తలపడుతున్నారు. ఎన్నికల్లో ఇరువురు నేతల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది.