Donald Trump: రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఎమోషనల్ కు గురయ్యాడు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. ఏ మాత్రం పొరపాటు జరిగినా తాను ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదని చెప్పుకొచ్చారు. యూఎస్ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్ అధికారికంగా అంగీకరం తెలిపారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోంది.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ హామీ ఇచ్చారు.
Read Also: Do Not Drink Water: ఈ పండ్లను తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. డేంజర్లో ఉన్నట్లే..
ఈ సందర్భంగా తనపై జరిగిన కాల్పుల ఘటనను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్ సరిగ్గా తన దగ్గరకు వచ్చిన టైంలో తల పక్కకు తిప్పానని చెప్పుకొచ్చారు. వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్ వైపు చూశాను.. ఒక వేళా అలా జరిగి ఉండకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్ నా తల లోపలికి చొచ్చుకుని పోయేది అన్నారు ట్రంప్. తాను ఇలా అందరి ముందు నిలబడి మాట్లాడే వాడిని కాదన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులే తనని కాపాడాయి.. ఆ క్షణంలో స్వయంగా దేవుడే తన మృత్యువును అడ్డుకున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.