హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెనిన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయినట్లుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్‌పై బుధవారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలు 10 మంది పాలస్తీనియన్లను చంపగా, 80 మందికి పైగా తుపాకీ గాయాలకు గురయ్యారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.