South Korea Plane Crash: దక్షిణ కొరియాలోని ముయాన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 179 మంది మరణించినట్లు తెలుస్తుంది. కాగా, ఈ
దారుణానికి గల కారణం కేవలం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమిక విచారణలో తేలింది. బ్యాంకాక్ నుంచి వస్తున్న ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ల్యాండ్ అదుపుతప్పింది. దీంతో రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, విమానం ల్యాండ్ కావడానికి ట్రై చేసినప్పటికి ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఇద్దరు సిబ్బంది మినహా మిగిలిన వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: Sankranti Special Buses: గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు
అయితే, ఈ ఫ్లైట్ అప్పటికే ల్యాండింగ్ చేసేందుకు ట్ర చేసి విఫలమైందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది నేలపైకి దిగిన తర్వాత రన్‌వే చివరికి వస్తుండగా వేగాన్ని తగ్గించడంలో ఫెయిల్ అయినట్లు తెలిపారు. ఇది ఎయిర్‌పోర్టు రక్షణ గోడను ఢీకొనడంతో విమానంలోని ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే ల్యాండింగ్ గేర్ పని చేయకపోయి ఉండొచ్చన్న డౌట్స్ ఉన్నాయి. ఇక, ఈ ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో విమానంలో మొత్తం 175 మంది ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బంది ఉండగా.. అందులో 179 మృతి చెందగా కేవలం ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని దక్షిణ కొరియా న్యూస్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
"How did this happen? 🚨
Jeju Air Flight 2216 crashes at Muan airport, killing nearly 179 after a failed belly landing.
Only 2 survivors rescued. Was it a mechanical failure or human error? #JejuAir #muanairport #SouthKorea #planecrash #Flightcrash pic.twitter.com/g3OWnap5MI
— Deepak yadav (@DeepakYadav_4U) December 29, 2024