Fractured Ribs: చైనాలో ఓ మహిళకు పక్కటెముకలు విరిగిపోయాయి. అయితే ఏ ప్రమాదంలోనో, లేక కింద పడిపోవడంతోనో ఎముకలు విరిగిపోయాయి అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. కేవలం దగ్గినందుకు ఆమె ఎముకలు విరిగాయి. అదేంటి కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోతాయా? అనేగా మీ ప్రశ్న? అవును ఆమె దగ్గినందుకే పక్కటెముకలు విరిగిపోయారు. వామ్మో అదేంటి దగ్గితే ఎముకలు విరిగిపోతాయా అనుకుటుంన్నారా? ఆగండి ఆమెకు అలా ఎందుకు జరిగిందో? ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా!
Read also: RBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వాటికోసం ఇక బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు..
చైనాలోని షాంఘైలో ఓ మహిళ బాగా దగ్గి పక్కటెముకలు విరగడంతో ఈవార్త సంచలనంగా మారింది. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ షాంఘై మహిళ అనే మహిళ చాలా స్పైసీ ఫుడ్ తినింది. తిన్న వెంటనే ఆమెకు దగ్గరావడం మొదలైంది. అస్సలు గ్యాప్ లేకుండా దగ్గు వచ్చింది. అది వస్తూనే ఉంది. అయితే ఆమె అలా దగ్గుతూనే ఉండటంతో.. దగ్గుతున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చింది. కానీ ఆమె దాన్ని లైట్ గా తీసుకుంది ఎందుకంటే దగ్గతున్న కదా నొప్పి రావడం సహజం అనుకుంది. ఆనొప్పిని పట్టించుకోలేదు. దగ్గుతున్నప్పుడు కాస్త పట్టుకోవడం మామూలే అనుకుంది. అయితే దగ్గుఆగడంలేదు దీంతో ఆమెకు ఛాతిలో నొప్పి ఎక్కువ రావడంతో భరించలేక చివరికి ఆస్పత్రికి వెళ్లింది.
జరిగిన విషయం వైద్యులకు చెప్పడంతో.. ఆమెను పరీక్షించిన వైద్యులు సీటీ స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్ తిన్నారు. ఆమెకు నాలుగు పక్కటెముకలు విరగడం చూసి ఆశ్చర్యపోయారు. విపరీతంగా దగ్గడం వల్ల ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయో డాక్టర్ వివరించారు. ఆమె బరువు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎముకలకు ఆధారంగా ఉండే కండరం పెరగలేదని వైద్యులు గుర్తించారు. ఆమె 171 సెంటీమీటర్ల పొడవు కేవలం 57 కిలోల బరువు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకున్న తరువాత సరైన భోజనం తీసుకుంటా కొన్ని వ్యాయామాలు చేస్తే కండరాన్ని పెంచుకోవచ్చిని వైద్యులు తెలిపారు.
Himachal pradesh Results: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యం