China: భారత్, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డు.. ముంబయి పేలుళ్ల సూత్రధారికి అండ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ‘ప్రపంచ తీవ్రవాదిగా’ గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం, అమెరికా సహకారంతో ప్రతిపాదించిన ప్రతిపాదనపై చైనా శుక్రవారం మరో సారి అడ్డుపుల్ల వేసింది. భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 2008 ముంబై దాడులలో పాల్గొన్న సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను డ్రాగన్ అడ్డుకుని తన ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. యూఎన్ భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ క్రింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత్, అమెరికాలు ప్రతిపాదించాయి.
సాజిద్ మీర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో పాటు అతడి ఆస్తులను స్తంభింపజేయడం, అతడి ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్ ప్రతిపాదించాయి. దీనికి ఐరాస భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా.. ఒక్క చైనా మాత్రం దీన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో సాజిద్ మీర్‌ను అంతర్జతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇటీవల కాలంలో భారత్-యూఎస్ ప్రతిపాదనను చైనా నిరోధించడం ఇది మూడోసారి. అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, జైషే మహ్మద్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరినప్పుడు కూడా చైనా ఇలానే అడ్డుకుంది. చీఫ్ మసూద్ అజార్‌కు బీజింగ్ రక్షణ కల్పించింది. లష్కరే తొయిబా డిప్యూటీ కమాండర్ అయిన్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీపై ఆంక్షలు విధించాలని జూన్‌లో ప్రతిపాదించగా అప్పుడు కూడా చైనా అడ్డుకుంది. యూఎన్ భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ అల్‌ఖైదా వ్యక్తులు, సమూహాలు, సంస్థలు, కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సంస్థలపై ఆంక్షలను విధిస్తుంది.
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
Chinese Loan Apps: స్విఛ్.. చైనాలో. సెర్చ్.. ఇండియాలో. హైదరాబాద్ సహా 16 చోట్ల ఈడీ దాడులు
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సాజిద్ మీర్.. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాలో 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. ముంబై ఉగ్రదాడి (నవంబర్ 26, 2008) సూత్రధారులలో సాజిద్ మీర్ ఒకడు. ఈ దాడిలో, 175 మంది మరణించారు (18 మంది పోలీసు సిబ్బంది, 122 మంది, 26 మంది విదేశీయులు, 9 మంది ఉగ్రవాదులు), 291 మంది గాయపడ్డారు. భారతదేశం, పాశ్చాత్య దేశాలతో సహా అనేక దేశాల పౌరుల మరణానికి దారితీసిన అతిపెద్ద విదేశీ ఉగ్రవాద దాడికి అతను బాధ్యత వహించాడు. అతడిపై అమెరికా 5 మిలియన్ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. గతంలో సాజిద్ మీర్ చనిపోయినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసింది. కానీ, పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్.. ఈ ఏడాది జూన్‌లో అతడికి 15ఏళ్లు జైలుశిక్ష విధించింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!