ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సోమవారం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్‌ఐఎల్ (దాయెష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసింది.
లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది సాజిద్ మీర్‌ను 'ప్రపంచ తీవ్రవాదిగా' గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం, అమెరికా సహకారంతో ప్రతిపాదించిన ప్రతిపాదనపై చైనా శుక్రవారం మరో సారి అడ్డుపుల్ల వేసింది.
అవకాశం దొరికితే భారత్ ను ఎలా ఇరికించాలనే ఆలోచనతోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో…