China: పిల్లల్ని కనండి ప్లీజ్.. జననాల రేటు పెంచేందుకు ప్రయత్నిస్తున్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. భారత్‌లో జనాభా పెరుగుతూ ఉండగా.. చైనాలో మాత్రం జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. 2025 నాటికి దేశంలో జనాభా క్రమక్రమంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో చైనా అప్రమత్తమైంది. జనాభాను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ‘ఒక బిడ్డ విధానాన్ని’ సడలించినప్పటికీ, 2017 నుండి చైనా జననాల రేటు తగ్గుముఖం పట్టింది. ఐనప్పటికీ గత ఐదేళ్లలో జననాల రేటు భారీగా తగ్గింది.
ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్లలను కనే వారికి సబ్సిడీలు, పన్ను రాయితీలు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించాలని సూచించింది. జనాభా పెంపు చర్యలపై వ్యయాన్ని పెంచాలని… దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలకు జాతీయ ఆరోగ్య కమిషన్ సూచించింది. జనాభా పెంపు చర్యలను క్రియాశీలకంగా అమలు చేయాలని పేర్కొంది.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Indian Employees: బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులు ఎప్పుడైనా షాక్ ఇవ్వొచ్చు…! తాజా సర్వే
ఈ చర్యలలో భాగంగా మెరుగైన ప్రసూతి సంరక్షణ సేవలు, పబ్లిక్-బెనిఫిట్ చైల్డ్ కేర్ సేవలు, మెరుగైన ప్రసూతి, తల్లిదండ్రుల సెలవు విధానాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రసూతి భీమా పరిధిలోకి వచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. 2021లో ఈ సంఖ్య 240 మిలియన్లకు చేరుకుంది, 2012 కంటే 1.5 రెట్లు ఎక్కువ. 2020లో ఏడవ దేశవ్యాప్త జనాభా గణనలో చైనా ఏటా సగటున 0.53 శాతం వృద్ధిని కనబరిచింది. గత ఏడాది చైనా కొత్త చట్టాన్ని జారీ చేసింది. ఇది చైనీస్ జంటలకు ముగ్గురు పిల్లలను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా జంటలు అదనపు పిల్లలను కనడానికి ఇష్టపడకపడట్లేదని పలు సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. 2020లో దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణన తర్వాత మూడో బిడ్డను అనుమతించాలనే నిర్ణయం అమలు చేయబడింది. జనాభా లెక్కల ప్రకారం, 60 ఏళ్లు పైబడిన వారు 18.7 శాతం పెరిగి 264 మిలియన్లకు చేరుకున్నందున చైనా జనాభా సమస్య మరింత తీవ్రమవుతుందని అంచనా వేయబడింది.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!