Terror Attack : ఉత్తర సిరియాలో సోమవారం ఉదయం ఘోర బాంబు పేలుడు సంభవించింది. మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది.
సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది.