Cake Auction: 41 ఏళ్ల నాటి కేక్ వేలం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cake Auction: 41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. నాలుగు దశాబ్దాల నాటి కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి. అసలు అంతకాలం కేక్ ముక్క ఈనాటికి ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అసలు దాన్ని వేలం వేయడానికి కారణమేంటి? ఆ కేక్ ఎక్కడిది? ఎవరు తిన్నది? ఏ సందర్భంలో కట్ చేసింది? అనే అనుమానాలు రాక తప్పవు. 41 ఏళ్ల నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి. నిజమే మరి.. ఆ కేక్ ముక్కకు అంతటి ఘనత ఉందండోయ్. బ్రిటన్ కింగ్ చార్లెస్, రాణి డయానా పెళ్లి నాటి కేక్ కావడమే ఆ కేక్ ముక్క విశేషం. ఈ కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్స్ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేకును వేలం వేసేందుకు సిద్ధమైంది.
1981లో జరిగిన కింగ్ చార్లెస్ – ప్రిన్సెస్ డయానాల పెళ్లికి ప్రపంచ దేశాల నుంచి 3వేల మందికి పైగా బంధుమిత్రులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆ వివాహాన్ని టీవీల్లో వీక్షించారు. దాంతో 20వ శతాబ్దంలోనే గొప్ప పెండ్లిగా అది రికార్డుల్లో నిలిచింది. అయితే పెండ్లికి హాజరైన మూడు వేల మందిలో నిగెల్ రికెట్స్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఆయనకు కూడా ఈ పెళ్లిలో ఓ కేకు ఇచ్చారు. నిగెల్ ఆ కేకును ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని భద్రపరిచారు. గత ఏడాది ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన భద్రపరిచిన కేకు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. నిగెల్ రికెట్స్ భద్రపరిచిన ఆ కేకు ముక్కను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. వేలంలో ఆ కేకు ముక్క ప్రారంభ ధరను భారత కరెన్సీలో సుమారు రూ.27వేలుగా నిర్ణయించారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Tamilnadu Assembly: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ నిషేధం బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
నిగెల్ రికెట్స్ బతికి ఉండగా.. ఈ కేకులోని ఓ ముక్కను వేలం వేశారు. 2014లో జరిగిన ఈ వేలంలో ఈ కేకు ముక్క మన కరెన్సీలో రూ.1.27లక్షలు పలికింది. కాగా రికెట్స్, ఇతర రాజ కుటుంబ సభ్యులు చార్లెస్-డయానా కోసం వివాహ కానుకగా ఒక రైటింగ్ టేబుల్‌ను బహూకరించారట. ఆ టేబుల్‌ను చూసి కింగ్ చార్లెస్ చాలా సంతోషపడ్డారట. ఇదిలావుంటే 1981, జూలై 29న జరిగిన చార్లెస్-డయానాల వివాహ బంధం కొన్నేండ్లకే తెగిపోయింది. 1992లో వారు విడిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రమాదంలో డయానా ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!