టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.. డిజే టిల్లు సినిమాతో గతంలో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చింది.. ఒకవైపు విమర్శలు వస్తున్న సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అందడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఆ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది..
తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందు బెంగళూరులో ఒక షో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అమెరికాలో కూడా ముందుగానే షోలు పడ్డాయి.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై పాజిటివ్ మరియు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. మరి సినిమా హిట్టు కొట్టిందా? లేదా బోల్తా కొట్టిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జనాల స్పందన ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
ఈ సినిమా ఒక విన్నర్, పాజిటివ్ టాక్ ను అందుకుంది.. విపరీతంగా నవ్వించే సన్నివేశాలు ఉన్నాయి. టిల్లు మేజిక్ సినిమా అంతా రిపీట్ అయ్యింది.. టిల్లన్న మంచి ఫన్ ను క్రియేట్ చేశారు.. సినిమా సూపర్ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు..
#TilluSquare is a winner. Proper LOL moments in typical Tillu style. Repeats the magic all over again. Tillanna delivers a fun theatrical experience 🤘🏼🤘🏼.
— …. (@ynakg2) March 28, 2024
అలాగే డీజే టిల్లు’ హిట్ కావడం, సీక్వెల్ సాంగ్స్ & ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడంతో సూపర్బ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు రీ రికార్డింగ్ చేసిన భీమ్స్ ఆ అంచనాలను మరింత పెంచారు.. మ్యాడ్ సినిమాకు తాత లాగా ఉందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు..
ఇక ట్రైలర్ కట్ చేయడం వల్ల ఎలాంటి అంచనాలు లేకుండా పోయింది.. నచ్చింది కానీ.. చాలా సీక్వెన్స్‌లు పేలాయి.. సరైన కామెడీ.. ఫస్ట్ పార్ట్ కంటే బెటర్..స్క్రీన్ ప్లే బాగుందని మరో యూజర్ రాసుకొచ్చాడు..
Went without any expectations because of a bad trailer cut .. loved it kaani.. chaala sequences blast iyay.. crazy proper comedy.. better than first part.. better screenplay and comedy than first part.. 3.5/5#TilluSquare
— Tony (@tonygaaaadu) March 29, 2024
ఒకవైపు పాజిటివ్ టాక్ వస్తున్నా కూడా మరోవైపు నెగిటివ్ టాక్ ను కూడా అందుకుంటుందని తెలుస్తుంది.. పార్ట్ 2 కోసం ఈ ప్రమోషన్‌లు పూర్తిగా కృత్రిమమైనవని నేను భావించాను అంటూ రాసుకొచ్చారు..
https://twitter.com/SriFanOfPk1/status/1773520545461538993?t=fTUR3utATO2q4cOFlRj4NQ&s=19
మొత్తంగా చూసుకుంటే పాజిటివ్ మరియు నెగిటివ్ టాక్ తో సినిమా పర్వాలేదనిపిస్తుందని పబ్లిక్ చెబుతున్నారు.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..