Benjamin Netanyahu: కింగ్ బీబీ..కరుడుగట్టిన జాతీయవాది..ఇజ్రాయిల్ ప్రధాని గురించి కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: జెంజిమిన్ నెతన్యాహు-ఇజ్రాయిల్ ఈ రెండు పర్యాయపదాలుగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి కంటే ఏ దేశంలో కూడా మరో వ్యక్తి ఎక్కువ కాలం దేశాన్ని పాలించడం చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల జాబితాలోకి వస్తారు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ లో అతి పిన్న, అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నెతన్యాహుకు పేరుంది. 1988లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కేవలం 8 ఏళ్లలోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
కరుడుగట్టిన జాతీయవాదిగా, కింగ్ బీబీగా పిలుచుకునే నెతన్యాహూ 1996లో అధికారంలోకి వచ్చినప్పుడు, పాలస్తీనాతో ఎప్పుడూ శాంతి ఒప్పందానికి అవకాశం ఇవ్వలేదనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
సైనికుడి నుంచి ప్రధానిగా..
1949లో టెల్ అవీవ్ లో జన్మించిన నెతన్యాహు కుటుంబం 60వ దశకం ప్రారంభంలో కొన్నేళ్ల పాటు అమెరికా వెళ్లారు. 18 ఏళ్ల వయసులో 1967లో నెతన్యాహూ ఇజ్రాయిల్ తిరిగి వచ్చి సైన్యంలో చేరాడు. ఇజ్రాయిల్ పటిష్టమైన కమాండో యూనిటైన సయెరెట్ మత్కల్ వంటి వాటికి కెప్టెన్‌గా పనిచేశారు. సైన్యం నుంచి బయటకు వచ్చిన నెతన్యాహూ 1972-76 మధ్య చదువుకునేందుకు మళ్లీ అమెరికా వెళ్లారు.
బెంజిమెన్ నెతన్యాహూ సోదరుడు యోనాతన్ నెతన్యాహూ ఇజ్రాయిల్ సైనిక హీరోల్లో ఒకరు. బందీగా ఉన్న యూదులను విడిపించే ‘ఆపరేషన్ ఎంటెబ్బే’ సమయంలో మరణించాడు. ఈ ఆపరేషన్ లో 100 మందికి పైగా యూదుల్ని రక్షించారు. 1978లో తన సోదరుడి జ్ఞాపకార్థం ది జోనాథన్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు. అతను 1994 నుండి 1998 వరకు UNలో ఇజ్రాయెల్ యొక్క శాశ్వత ప్రతినిధిగా ఉన్నాడు. ఆ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
1988లో రాజకీయ అరంగ్రేటం చేసిన నెతన్యాహూ రైట్ వింగ్ లికుడ్ పార్టీ తరుపున పోరాడి గెలిచారు. డిఫ్యూటీ ఫారిన్ మినిస్టర్ గా సేవలు చేశారు. ఆ తరువాత 1993లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. పాలస్తీనాతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అప్పటి ప్రధాని యిట్జాక్ రాబిన్ 1995లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఒక ఏడాదికే నేరుగా ఎన్నికైన ఇజ్రాయిల్ ప్రధానిగా నిలిచారు.
అవినీతి మచ్చ.. హమాస్ దాడులు.
బెంజిమెన్ నెతన్యాహూ 6 సార్లు, 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అయితే గతవారం జరిగిన హమాస్ దాడులు, ఈ దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీలు మరణించడం జెంజిమెన్ నెతన్యాహుకు కళంకంగా మారాయి. దేశాన్ని రక్షించలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు లంచం ఆరోపణలు, న్యాయసవరణలపై ఇటీవల ఇజ్రాయిల్ అట్టుడికింది. నెతన్యాహుపై ప్రజలు నిరసన తెలిపారు. ఇది జరిగిన కొన్ని నెలల్లోనే తాజాగా హమాస్ అటాక్ జరిగింది.
ఐసిస్ తరహాలోనే హమాస్ ని తొక్కెస్తామని నెతన్యాహూ హెచ్చరించాడు. 24 గంటల్లో గాజాను ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధాన్ని దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా, ప్రపంచదేశాల నేతలతో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!