Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. యూరోపియన్ దేశం నిర్ధారణ
- బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ
- నిర్ధారించిన యూరోపియన్ దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొంది. అయినప్పటికీ కేసు యొక్క పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. చోక్సీ అప్పగింతపై భారత అధికారులు తమను సంప్రదించినట్లుగా బెల్జియన్ అధికారులు నిర్ధారించారు. ఇదే కేసులో సహ నిందితుడైన అతని మేనల్లుడు నీరవ్ మోడీని కూడా లండన్ నుంచి రప్పించేందుకు భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల రుణ మోసం కేసులో నీరవ్ మోడీతో కలిసి నిందితుడిగా ఉన్న 65 ఏళ్ల చోక్సీ.. బెల్జియం పౌరురాలు అయిన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ప్రస్తుతం ఆంట్వెర్ప్‌లో నివసిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP News: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ, రెండు ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13,500 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం చోక్సీ, నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ.. ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!