Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.
దేశంలో మరో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.