భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. దీని వలన భూమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించింది. అదే ఏడాది నాసా ఒసైరిస్ రెక్స్ అనే వ్యోమనౌకను ఆ గ్రహశకలం మీదకు పంపింది. నాలుగేళ్లపాటు ప్రయాణం చేసిన వ్యౌమనౌక గతేడాది అక్టోబర్ 21 వ తేదీన విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై దిగింది. అప్పటి నుంచి ఆ వ్యౌమనౌక పరిశోధనలు చేస్తున్నది.
Read: ఆగస్టు 13, శుక్రవారం దినఫలాలు
తొలుత ఆ గ్రహశకలం 2182 సెప్టెంబర్ 24 వ తేదీన భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్టుగా నాసా గుర్తించింది. 2182 సెప్టెంబర్ 24 వ తేదీని భయానకమైన రోజుగా నాసా ప్రకటించింది. అయితే, గ్రహశకలం ప్రయాణం చేసే తీరును బట్టి ఇది 2200లో భూమికి చేరువగా రావొచ్చని అంచనా వేసింది. 2300 సంవత్సరంలో బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని, నాసా అంచనా వేస్తున్నది. బెన్ను భూమిని ఢీకొంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది నాసా. బెన్ను-భూమికి మధ్య దూరం 29.3 కోట్ల కిలోమీటర్లు ఉందని, ఇది ఆరేళ్లకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తున్నట్టు నాసా పేర్కొన్నది.