గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ను అంతం చేసి బందీలను విడిపించడమే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. గాజా కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం చేసింది. దీన్ని అమెరికా తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. అయితే భద్రతా మండలి తీర్మానాన్ని గురువారం అమెరికా వ్యతిరేకించింది. అల్ జజీరా నివేదక ప్రకారం.. మధ్యప్రాచ్యానికి అమెరికా డిప్యూటీ స్పెషల్ రాయబారిగా ఉన్న మోర్గాన్ ఓర్టగస్.. వాషింగ్టన్ వ్యతిరేకతను సమర్థించారు. యూఎన్ తీర్మానంపై అమెరికా నుంచి వ్యతిరేకత రావడంలో ఆశ్చర్యం లేదన్నారు. హమాస్ తీవ్రవాదం నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెప్పారు. దురదృష్టవశాత్తు యూఎన్.. హమాస్‌కు మద్దతుగా నిలబడడం బాధాకరం అన్నారు. హమాస్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా హమాస్.. కొంత మంది బందీలను విడుదల చేసింది. ఇంకొందరు హమాస్ చెరలోనే ఉన్నారు. వారిని విడిపించడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. హమాస్ మాట వినడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. హమాస్‌ను అంతం చేస్తామంటూ కంకణం కట్టుకుంది.