America: రష్యాపై అమెరికా క్లస్టర్ ఆయుధాలు.. ఉపయోగిస్తున్న ఉక్రెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: రష్యాపై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ క్లస్టర్ ఆయుధాలను వాడుతోంది. అమెరికా ఉక్రెయిన్‌కు పంపిన క్లస్టర్ ఆయుధాలు రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తుంది. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ ఒడెస్సాపై రష్యా కూడా తమ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాము సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాలను ఉక్రెయిన్ సేనలు.. రష్యా దళాలపై వాడుతున్నాయని అమెరికాలోని శ్వేత సౌధం ధ్రువీకరించింది. నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి జాన్ కిర్బి మాట్లాడుతూ రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా పోర్టు తదితర కీలక ప్రాంతాలపై రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేస్తోంది. దీంతో 19 మంది గాయపడ్డారు. ఫలితంగా ఉక్రెయిన్ దళాలు క్లస్టర్ ఆయుధాల వినియోగం ప్రాంభించాయి. జులై 8వ తేదీన క్లస్టర్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం తర్వాత వాటిని కీవ్‌కు చేర్చింది. అమెరికా పంపిన వాటిల్లో ఎం864, ఎం483ఎ1 క్లస్టర్ ఆయుధాలున్నాయి. వీటిల్లో డడ్రేటు 2.35శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఈ రకం ఆయుధ సరఫరాతో ఉక్రెయిన్‌కు మందుగుండు కొరత కూడా తీరుతుంది.
Read also: Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా, ఐరోపా సమాఖ్యలు సంప్రదాయ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ కొరత తీర్చేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తాజాగా తాము ఇచ్చిన క్లస్టర్ ఆయుధాలను ప్రజలు నివసించే ప్రాంతాల్లో వాడమని ఉక్రెయిన్ వద్ద మాటతీసుకొన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. మరో వైపు క్లస్టర్ ఆయుధ సరఫరాపై గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. తమ వద్ద కూడా తగినన్ని క్లస్టర్ ఆయుధాలున్నాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ ఉక్రెయిన్ ఇటువంటి ఆయుధాలు వాడితే.. తాము కూడా వాడతామని హెచ్చరించారు. మార్చిలో ఐరాస వెలువరించిన ఓ నివేదికలో ఇప్పటికే రష్యా 24 సార్లు క్లస్టర్ ఆయుధాలు వాడినట్లు ఓ నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరంపైన కనీసం 11 క్లస్టర్ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది.
Read also: Kiara Advani : ఆ సమయంలో నా భర్త నాకు అండగా నిలిచాడు..
ఉక్రెయిన్‌పై రష్యా నాలుగు రోజుల్లో 70 క్షిపణులు ఉపయోగించింది. క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్ వంతెనపై దాడి అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. నాలుగు రోజుల్లో 70 క్షిపణులు, 90 షహీద్ డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్ ఓడరేవు నగరమైన ఒడెస్సాలో విధ్వంసం సృష్టించింది. మరో వైపు రష్యా ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వరకు తమ సైన్యం కూల్చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. కాకపోతే మొత్తం ఉక్రెయిన్ను కాపాడుకోవడానికి తమ శక్తి సరిపోదని ఆయన పేర్కొన్నారు. తమ భాగస్వాముల నుంచి అదనపు రక్షణ పరికరాలు పొందడంపై చర్చిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!