Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్ నిలిపివేత!
- భయపడ్డ అమెజాన్, వాల్‌మార్ట్
- భారత్ స్టాక్ నిలిపివేత!
- ప్రచారం అవుతున్న వార్తా కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల వరకు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత 25 శాతం టారిఫ్ పెంచగా.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ట్రంప్ పెంచారు. దీంతో పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.
ఇది కూడా చదవండి: Gaza-Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజా స్వాధీనానికి కేబినెట్ పచ్చజెండా
Also Read
తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ దగ్గజ వ్యాపార కంపెనీలు అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతదేశం నుంచి వచ్చే ఆర్డర్‌లను నిలిపివేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. తదుపరి సమాచారం వచ్చేంత వరకు దుస్తులు, వివిధ సరుకులను నిలిపివేయాలని భారత టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Trump-Putin: జెలెన్‌స్కీతో ఎలాంటి చర్చలుండవు.. ట్రంప్-పుతిన్ భేటీ ఉంటుందన్న రష్యా దౌత్యవేత్త
ట్రంప్ విధించిన టారిఫ్‌ను కొనుగోలుదారులు భరించడానికి ఇష్టపడడం లేదు. ఇక ఎగుమతిదారులైనా ఖర్చులు భరిస్తారా? అని చూస్తే వారు కూడా అందుకు అంగీకారంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో భారత్ స్టా్క్‌లు నిలిపివేయాలని అమెజాన్, వాల్‌మార్ట్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధిక సుంకాల కారణంగా ఖర్చులు 30 శాతం నుంచి 35 శాతం వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. దీని వలన అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 శాతం నుంచి 50 శాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీని వలన దాదాపు 4-5 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Huma Qureshi: ఢిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య
భారత్‌లో వెల్‌స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్‌టైల్ ఎగుమతిదారు సంస్థలు తమ విక్రయాల్లో 40-70శాతం అమెరికాకే పంపిస్తున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో తమకు అగ్రరాజ్యం నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటివరకు భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఈ రంగంలో 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్లగా.. ఇందులో 28 శాతం అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై 20శాతం టారిఫ్‌లు ఉన్నందున.. అమెరికా సంస్థలు టెక్స్‌టైల్ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచించే అవకాశం ఉంది.
రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నందున భారత్‌పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించిన ఆయన.. ఇటీవల దాన్ని 50శాతానికి పెంచారు. గతంలో ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా.. అదనపు సుంకాలు ఈనెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ టారిఫ్‌లతో వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడనుంది.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?