Lebanon-Israel War: తక్షణమే లెబనాన్‌ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- తక్షణమే లెబనాన్‌ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- భారత్‌తో పాటు పలు దేశాలు ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్‌ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది. అంతేకాకుండా ఇటీవల ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత మరింత కఠినమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళిక రచించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే భారతీయులు లెబనాన్‌ను ఖాళీ చేయాలని కేంద్రం సూచించింది. ఇక తప్పని పరిస్థితులు ఉంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కేంద్రం సూచించింది. లెబనాన్‌లోని భారతీయ పౌరుల కోసం ఎంబసీ ఎమర్జెన్సీ నంబర్ ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Delhi High Court: గర్భిణీగా ఉండటం అనారోగ్యం కాదు.. ఆమెకు ఉద్యోగాన్ని తిరస్కరించలేరు..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా పలు దేశాలు తమ పౌరులను లెబనాన్ విడిచి వెళ్లాలని కోరాయి. తమ పౌరులకు లెబనాన్ నుంచి త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తూ సలహాలు జారీ చేశాయి.
ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో గత శనివారం హెజ్బొల్లా దాడితో ఫుట్‌బాల్ ఆడుతున్న 12 మంది చిన్నారులు, యువత మృతి చెందారు. దీంతో తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేయవచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్ర్, ఆ సంస్థ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ కిపణులతో దాడిచేసింది. ఈ దాడిలో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతి చెందాడు. షుక్ర్ మృతిని హెజ్బొల్లా ధ్రువీకరించింది.
ఇది కూడా చదవండి: Kerala Floods: కేరళ వరదలు.. సూర్య అండ్ కో భారీ విరాళం
ఆ తర్వాత కొద్ది గంటలకే ఇరాన్లో ఉన్న హామస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అక్టోబర్ 7 మెరుపు దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హమాస్ సైనిక విభాగాధిపతి మహ్మద్ డెయిఫ్‌ను హత్య చేసినట్లు తాజాగా ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!