Israeli Operation: ఇజ్రాయిల్ ఇరాన్‌ని తన అస్తిత్వానికి ముప్పుగా చూస్తోంది. ఇరాన్ చేతికి న్యూక్లియర్ ఆయుధాలు రావద్దనేది ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలపై, వారి సైంటిస్టులను టార్గెట్ చేసి దాడులు చేసింది. 2005 నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం, ఇరాన్ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయిల్, భారీ దాడులు చేసింది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
Israel Strikes Iran: ఇరాన్‌లో నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు స్టార్ట్ చేసింది. ఈరోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి ఈ మేరకు దాడులు చేస్తోంది.
Israel strikes: లెబనాన్‌లోని బీరుట్‌లో ఉన్న హెజ్‌బొల్లా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బ తీయటమే టార్గెట్ గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుంది. హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ వార్నింగ్ ఇచ్చింది.
Iran Israel War: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా లోని భూగర్భ కమాండ్ సెంటర్లపై అనేక వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో ఏకంగా 50 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో హిజ్బుల్లా సౌత్ ఫ్రంట్, రద్వాన్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. సోమవారం నాడు IAF దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లోని నాజర్ యూనిట్, బదర్ యూనిట్, అజీజ్ యూనిట్‌పై దాడి చేసింది. హిజ్బుల్లా సంస్థ సదరన్…
Israel- Iran: హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. బెంజమిన్ నెతన్యాహు సర్కార్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్‌ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వైద్యులు సోమవారం తెలిపారు.
ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ పై దాడులు చేస్తున్న భాగంలో.. హెజ్ బొల్లా., గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దింతో హెజ్ బొల్లా పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు చేస్తున్నాయి. ఇకపోతే., మరోసారి ఇజ్రాయెల్ దళాలు ఆ హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై త్రీవ స్థాయిలో విరుచుకుపడ్డాయి. దాంతో ఇజ్రాయెల్ దళాలు బుధవారం నాడు సిరియాపై భారీగా దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు…
రాకెట్ల దాడితో ప్రతీకారం తీర్చుకున్న పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబు దాడులను విస్తరించడంతో గాజాలో వాతావరణం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ఉద్యమం ఇస్లామిక్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ బ్రేకింగ్ డాన్ కింద గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల కారణంగా 24 మంది మరణించగా.. మరో 203 మంది గాయపడ్డారు.