China Visas: రెండున్నరేళ్ళ తర్వాత చైనా కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ విద్యార్ధులకు చైనా శుభవార్త అందించింది. గతంలో చైనాలో చదువులను మధ్యలోనే వదిలి వచ్చేసిన భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా రెండున్నర సంవత్సరాల తర్వాత వీసా ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. చైనా తిరిగి స్వాగతం పలుకుతోందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్ జీ రోంగ్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, వ్యాపారులు, చైనాలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం కూడా ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వచ్చే వారికి, కరోనా సమయంలో నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్న వారికి ఎక్స్-1 వీసాలను జారీ చేస్తామని పేర్కొంది.
Read Also: Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్దం.. ముహూర్తం ఈనెల 28..!
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
కరోనా సమయంలో చైనాలో వుండడం అంత సేఫ్ కాదని అక్కడున్న 23 వేల మంది విద్యార్థులు భారత్‌కు వచ్చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువమంది వైద్య విద్యార్థులే ఉన్నారు. ఇలాంటి వారిలో తిరిగి చైనా వచ్చి ఆగిపోయిన చదువును కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్న వారి జాబితాను చైనా ఇటీవల సేకరించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో వీరందరినీ తమ దేశానికి తిరిగి ఆహ్వానిస్తోంది. చైనా వెళ్లాలనుకునే వారు అక్కడి యూనివర్సిటీలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా కోసం సమర్పించాలి. పాత విద్యార్థులైతే చైనా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీసాలు ఇస్తామని చైనా ప్రకటించినా.. భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. మరోవైపు, శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు ఇటీవల ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. అక్కడ యూనివర్శిటీలు కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
జూలైలో, చైనాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల కుటుంబ సభ్యులను చైనా అనుమతించింది. వారిలో చాలా మంది సాధారణ టిక్కెట్ ధరల కంటే చాలా రెట్లు అధికంగా చెల్లించి ప్రక్క దేశాల్లోని వివిధ మార్గాల ద్వారా వచ్చారు. విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని భారత్, చైనా అధికారులు తెలిపారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించిన వీసాల వర్గంలో సిబ్బందికి జారీ చేసిన సి-వీసా కూడా ఉంది.
Read Also: Heavy Demand For Pulasa Fish: యానాంలో ఆ పులస చేపకు యమా డిమాండ్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!