Noida Twin Towers: నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరి కొద్దిరోజుల్లోనే 40 అంతస్తుల భారీ భవంతులు నేలమట్టం కానున్నాయి. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకకు అధికారులు ఈ నెల 28న జంట భవనాలను నేలమట్టం చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో.. ట్విన్ టవర్స్ 40 అంతస్తుల భారీ భవంతులను తొమ్మిది సెకన్లలోనే కూల్చేయనున్నారు. ఇక సుప్రీంకోర్టుఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో.. భవనాలను పేల్చేందుకు అవసరమైన పేలుడు పదార్థాలను టవర్లలో అమర్చారు. ఆగస్టు 28న మధ్యాహ్నం సూపర్‌టెక్ నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాలు నేలమట్టం కానున్నాయి. కేవలం తొమ్మిది సెకన్లలోనే 3,500కేజీల పేలుడు పదార్థంతో ఈ భారీ భవంతులను కూల్చేయనున్నారు. అక్కడే సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా.. సెక్టార్ 93-ఏలో ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్‌లోని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారు, ఆగస్టు 28న ఉదయం 7 గంటల నుంచి తమ ఫ్లాట్లను ఖాళీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో.. ఎడిఫస్ కంపెనీ చెప్పిన తర్వాతే తిరిగి ఇళ్లకు రావాలని సూచించారు. ట్విన్‌టవర్స్ చుట్టుపక్కల సొసైటీలు, పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. ఏప్రమాదం జరగకుండా.. ముందస్తుగా.. మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు, ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అయితే.. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. దీన్ని 2009 లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో.. ఇక కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. కూల్చివేత అనతంరం వాటిని తొలగింపుకు కనీసం మూడు నెలల సమయం పట్టనుందని అధికారులు పేర్కొన్నారు.
Astrology : ఆగస్టు 23, మంగళవారం దినఫలాలు