2019 డిసెంబర్ నుంచి ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. అమెరికాలో వ్యాక్సిన్ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇలానే ఇన్ఫెక్షన్లు పెరిగితే దాని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, కరోనా వేరియంట్ల కారణంగా మహమ్మారి మరితంత తీవ్రరూపం దాలిస్తే దానిని ఎదుర్కొనడం మరింత కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో పాటు ఇండియా, చైనా దేశాల్లో కేసులు మరలా పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజులోనే ప్రపంచం మొత్తంమీద 7 లక్షల కేసులు నమోదయ్యాయి. మే 14 వ తేదీ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇండోనేషియాలో రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ ప్రస్తుం 135 కి పైగా దేశాల్లో వ్యాపించింది.