త్వరలో భారత్ మార్కెట్లోకి స్కోడా 3 కొత్త మోడళ్లతో కార్లను విడుదల చేస్తుంది. అందులో ఒక EV కూడా ఉంది. ఇదిలా ఉంటే.. స్కోడా ఆటో ఇండియా, కుషాక్ మరియు స్లావియాతో సహా.. ఇండియా 2.0 ప్రోగ్రామ్ కార్లతో పోలిస్తే అమ్మకాల గణాంకాల పరంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది. అయితే.. చెక్ కార్ల తయారీ సంస్థ భవిష్యత్తులో కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశానికి రానున్న స్కోడా 3 కొత్త మోడళ్ల కార్ల గురించి…
ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2021లో జరిగిన T20 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో చీఫ్ సెలెక్టర్ కుర్చీ ఖాళీగా ఉండటంతో.. ఇతని పేరు బయటికొచ్చింది.
రాజస్థాన్‌లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.