పాకిస్థాన్ ప్రస్తుతం ఉగ్ర ముప్పును ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, ఆప్ఘనిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పాకిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది కూడా చదవండి: North Korea: చైనాకు ధీటుగా అణ్వాయుధ ప్రదర్శన.. బలాన్ని ప్రదర్శించిన కిమ్
శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నిండిన ట్రక్కును వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రం ప్రధాన గేటును ఢీకొట్టింది. పేలుడు జరిగిన వెంటనే వివిధ యూనిఫాంలు ధరించిన ఉగ్రవాదులు ఆవరణలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: Laura Loomer: అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి.. రిపబ్లికన్ నేత డిమాండ్
ఎదురుకాల్పులు ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని.. అలాగే ఆరుగురు పోలీసులు కూడా చనిపోయారని అధికారులు తెలిపారు. 13 మంది పోలీసులు గాయపడినట్లు చెప్పారు. శిక్షణార్థులు, సిబ్బందిని సురక్షితంగా వేరు ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఎస్‌జీ కమాండోలు, అల్-బుర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐదు గంటల పాటు జరిగిన ఆపరేషన్‌లో విజయవంతంగా పని చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!