బాంబు దాడులతో పాకిస్థాన్ దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున పెషావర్‌లోని పాకిస్థాన్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
Terror Attack Plan: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైష్ ఉగ్ర సంస్థ భారత్‌లో మరో ఆత్మాహుతి దాడికి ప్లాన్ రచించిందని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
పాకిస్థాన్ ప్రస్తుతం ఉగ్ర ముప్పును ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, ఆప్ఘనిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పాకిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. వాయువ్య పాకిస్థాన్‌లో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగినట్లగా అధికారులు తెలిపారు.
Pakistan: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అయితే, ఈ పరిణామంపై చైనా తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం పాక్-చైనా స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.
Turkey: ఇటీవల టర్కీలోని ప్రభుత్వ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోతున్న టర్కీ దానికి బాధ్యత వహించిన సంస్థ స్థావరాలను ధ్వంసం చేసింది.
ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే . తాజాగా భారత్ పై దాయాది దేశం పాక్ సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పాక్ మంత్రి ఒకరు అన్నారు. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని…
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి.
కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.