Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తాజా దాడుల్లో 585 మంది మృతి
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- తాజా దాడుల్లో 585 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇలా ఇరు పక్షాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. బుధవారం జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది ఇరానీయులు చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు వెల్లడించాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మోడీ షేక్‌హ్యాండ్.. వీడియో వైరల్
Also Read
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని.. లేదంటే పరిణామాలైతే తీవ్రంగా ఉంటాయని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఖమేనీ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘యుద్ధం మొదలైంది’’ అంటూ పోస్టు చేశారు. ఇక కనికరించం అంటూ రాసుకొచ్చారు. ‘‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. అంతేకాకుండా ఖడ్గం పట్టుకుని కోట గేటు దగ్గర ఓ వ్యక్తి ఉన్న ఫొటోను కూడా జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..