ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇలా ఇరు పక్షాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. బుధవారం జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది ఇరానీయులు చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.