Ayodhya Mosque:2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదును కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రామాలయం నిర్మాణం ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు మసీదు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్లూ స్థలం అనుమతి విషయాన్ని పెండింగ్‌లో ఉన్న వ్యవహారంపై అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కనున్న దన్నిపూర్ గ్రామంలో మసీదుని నిర్మించబోతున్నారు.
Minister KTR: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం
మసీదు నిర్మాణం కోసం స్థలం అనుమతి కోసం ఎంతోకాలంగా వెయిట్ చేయగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి లభించిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు. ఇంకా అగ్ని ప్రమాదం అనుమతి ఒక్కటే మిగిలుందని అన్నారు. తాము కేవలం మసీదుని మాత్రమే నిర్మించడం లేదని, 200 పడకల ఆసుపత్రిని కూడా తమకు మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు. తొలి దశలో రూ. 100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. ఈ టైంలోనే మసీదుకి సంబంధించి ఒక డిజైన్‌ని విడుదల చేశారు. అది ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండటంతో.. దాని గురించి నెట్టింట్లో చర్చలు కొనసాగుతున్నాయి.
Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
కాగా.. 1992 డిసంబర్ 6వ తేదీన ఒక కరసేవకుల గుంపు అయోధ్యలో ఉన్న 16వ శతాబ్దపు కట్టడం బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆరోజుల్లో దేశంలో నెలకొన్న మతపరమైన ఉద్రిక్తతలే ఈ సంఘటనకు దారి తీసింది. ఈ ఘటనలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ఈ వివాదాస్పద విషయం 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేదాకా కొలిక్కి రాలేదు. అంతకుముందు 2010 సెప్టెంబర్ 30వ తేదీన ఈ వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ.. అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు 2011లో స్టే విధించింది. 2017లో అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ.. విచారణకు ఆదేశాలిచ్చింది. 2019లో ఇరు వర్గాలకు న్యాయం చేస్తూ.. రామాలయం, మసీదుకి నిర్మాణాలకి స్థలాల్ని కేటాయించింది.