Rajnath Singh Talks About India China Clash At Tawang In Parliament: ఈనెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడారు. తవాంగ్‌లోని యాంగ్‌త్సే ప్రాంతంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని అన్నారు. అయితే.. వారిని మన రక్షణ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని, ఈ ఘర్షణలో మన భారతీయ సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉందని, చైనా దళాల ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదురించాయని పేర్కొన్నారు. మన దేశ భూభాగంలోకి చొరబడకుండా వాళ్లని నిలువరించారన్నారు.
Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి
ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని.. భారత సైన్యంతో పోలిస్తే, చైనా సైనికులే ఎక్కువమంది గాయపడ్డారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారతీయ సైనికుల్లో ఏ ఒక్కరూ కూడా తీవ్రంగా గాయపడటం గానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని.. పీఎల్ఏ సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా, తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు మన భారత సైన్యం నిబద్ధతతో కట్టుబడి ఉందని.. ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి.. చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ దాడిలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై ఎగబడ్డారని.. అందుకు భారత సైనికులు ధీటుగానే బదులిచ్చారని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు స్పల్పంగా గాయపడగా.. గాయపడ్డ భారత సైనికుల్ని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించామని తెలిపింది.
Cold: జలుబు వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో మటుమాయం!