Bus-Tanker Accident: బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus-Tanker Accident: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మూడు రోజుల్లో ప్రావిన్స్‌లో జరిగిన రెండవ అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇది అని రెస్క్యూ అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని హైవేపై అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
“లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మరణించారు. ఢీకొన్న తర్వాత, బస్సు మరియు ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకోగా ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ” అని పాకిస్థాన్ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాలిన గాయాలకు గురైన వారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.మరణించిన చాలా మంది ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని… సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు .అయితే.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్
ప్రమాదంలో విలువైన ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత ఆరోగ్య అధికారులను ఆదేశించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలను గుర్తించేందుకు సహకరించాలని ఆదేశించారు. శనివారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లోడుతో కూడిన ట్రక్కు ప్రయాణీకుల బస్సును ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!