Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ పాయింట్ ని ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు: హీరో శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree Vishnu Interview about om Bheem Bush Movie: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్స్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘ఓం భీమ్ బుష్’ ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది ?
చాలా ఆనందంగా వుంది. ఇందులో చాలా కొత్త పాయింట్, ఐడియా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్ కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్ కి పరిమితం కాకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చేశాం. ఖచ్చితంగా అందరూ ఎంటర్ టైన్ అవుతారు. మేము చెప్పే కొత్త పాయింట్ రివిల్ అయినపుడు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఆ సమయానికి కథలో మా పాత్రల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఈ కథ అనుకున్నప్పుడే ‘ఓం భీమ్ బుష్’ టైటిల్ ఫిక్స్ చేశారా ?
రెండు, మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఒకటి ఇంగ్లీష్ లో వస్తుంది. అయితే నేను మాత్రం ‘ఓం భీమ్ బుష్’ వైపే వున్నాను. ఇది చాలా క్యాచీ టైటిల్. చిన్నప్పుడు మనం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం( నవ్వుతూ).నిర్మాత వంశీ గారు ఫస్ట్ కట్ చూసి ‘ఓం భీమ్ బుష్’ పేరే ఫిక్స్ అయిపోదాం అన్నారు. అలా ‘ఓం భీమ్ బుష్’నే ఫైనల్ చేశాం. టైటిల్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టైటిల్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా, సినిమాని ముందు ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళేది అదే కదా.
ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకి కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ నటన, డైలాగ్ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ సినిమా అయిపోయే అవకాశం వుంది.. ‘ఓం భీమ్ బుష్’ లో ఆ ఒరిజినాలిటీ ఎలా ఉండబోతుంది ?
పాయింట్ పరంగా చూసుకుంటే ‘ఓం భీమ్ బుష్’ లాంటి పాయింట్ ఇప్పటివరకు రాలేదు. ఇందులో మిస్టరీ, థ్రిల్, ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా వర్క్ అవుట్ అవుతాయో ప్రేక్షకులు చూస్తున్నపుడు తెలుస్తుంది. అయితే ఎంటర్ టైన్మెంట్ పక్కాగా వస్తుంది. మిగతా ఏదుంటే అది బోనస్ అని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇంకొకటి బావుందని అంటారు. అది ఏమిటనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.
సామజవరగమన మార్కెట్ కాపాడుకోవాలి, పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారా?
నేను అలా ఎప్పుడూ ప్లాన్ చేయను. మార్కెట్ పెరగాలనే జోన్ లోకి వెళితే ఇంకా దాని పైనే దృష్టి ఉండిపోతుంది. నేను ఎప్పుడూ కూడా నిర్మాత మన మీద పెట్టిన పెట్టుబడి పోకూడదనే విషయంపై దృష్టి పెడతాను.
సామజవరగమన సెట్ చేసిన అంచనాలని ‘ఓం భీమ్ బుష్’ అందుకుంటుందా?
ఈ సినిమా వరకూ ‘ఓం భీమ్ బుష్’ మీద పెట్టిన పెట్టుబడికి మూడు, నాలుగు రెట్ల లాభం రావడం చాలా తృప్తిని ఇచ్చింది. దీనికి సామజవరగమన విజయం, ‘ఓం భీమ్ బుష్’ టీజర్, ట్రైలర్, యూవీ బ్యానర్ హెల్ప్ అయ్యింది. మంచి బ్యానర్ తో సినిమాలు చేయడం వారు అన్ని విషయాల్లో శ్రద్ద తీసుకుంటారు. దాంతో నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది.
‘బ్రోచేవారు’ తర్వాత మీరు, దర్శి, రాహుల్.. కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది కదా.. కామెడీ విషయంలో ఒక ప్రత్యేకమైన కథని ఎంచుకోవాలనే ఒత్తిడి ఏమైనా పెరిగిందా ?
నిజానికి మేము అంత ఒత్తిడి తీసుకోలేదు. మేము ముగ్గురం రెగ్యులర్ గా కలవడం వల్ల ఏమో కానీ పెద్ద మార్పు ఏమీ అనిపించలేదు. సరదాగా, ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకునేలా, అంత సహజంగా ఈ సినిమా చేశాం. సింగిల్ లైనర్స్ హిలేరియస్ గా వుంటాయి.
సెకండ్ హాఫ్ లో హిలేరియస్ బ్లాక్స్ ఉంటాయని విన్నాం ?
ఫస్ట్ హాఫ్ లో మూడు బ్లాకులు, సెకండ్ హాఫ్ లో రెండు బ్లాకులు ఎంటర్ టైన్మెంట్ పరంగా హిలేరియస్ గా బ్లాస్ట్ అవుతాయి. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్ గా చూస్తే ఇంకా అదిరిపోతుంది.
కథలో మీ ముగ్గురు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?
మేము సైంటిస్టులు కావాలని పీహెచ్డీ చేస్తాం. మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవ పురం అనే వూరు వస్తాం. ఆ వూర్లో ఎదురయ్యే పరిస్థితులు, పాత్రలు హిలేరియస్ గా వుంటాయి. కాలేజీలో వున్నపుడు ఎలా అయితే కింగ్స్ లా వుండేవాళ్లమో,, ఇక్కడ కూడా అలాగే కింగ్స్ లా మారుతాం. ఎక్కడున్నా కింగ్ లా బ్రతికేసే పాత్రలివి. ఈ క్రమంలో నిధిని పట్టుకునే టాస్క్ వస్తుంది. అసలు నిధి ఉందా లేదా .. మా ప్రయత్నం ఎలా జరిగింది అనేది మిగతా కథ. చాలా సరదాగా హిలేరియస్ గా సాగే సినిమా ఇది.
దర్శకుడు శ్రీహర్ష ఈ కథ ద్వారా ఎలాంటి కొత్తదనం తీసుకొచ్చారు ? ఆయన విజన్ ని అలా అంచనా వేశారు ?
శ్రీహర్ష చెప్పిన కథకు కొంచెం కలర్ ఫుల్ గా వెళితే బావుంటుందనిపించింది. రాజ్ తోట డీవోపీ. ఆయనతో ఆరు సినిమాలు చేశాను. వాళ్ళిద్దరికి కూడా మంచి సింక్. అలాగే సంగీతం సన్నీ. తన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఒక అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. మంచి టీం కుదరడంతో సినిమా టెక్నికల్ గా బాగుటుందని నమ్మకం. శ్రీకాంత్ ఆర్ట్ డైరెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. తను పెద్ద టెక్నిషియన్ అవుతారు. ఇంత మంచి టీం రావడంతో దర్శకుడు విజన్ కూడా క్లియర్ గా అర్థమైయింది.
దర్శకుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని చెప్పారు.. ట్రైలర్ లో ఒక్క హీరోయినే కనిపిస్తుంది. మిగతా వారిని దాచారా ?
దాయలేదండి. ప్రియా వడ్లమాని ఓ పాటలో కనిపిస్తారు. ట్రైలర్ లో ఆయేషా ఖాన్ కనిపించారు. నిజానికి సినిమాలో ఎటు చూసినా నేను, ప్రియదర్శి, రాహులే కనిపిస్తాం. మిగతా పాత్రలు పరిమితంగా సింపుల్ గానే వుంటాయి. ఈ కథ పరంగా హీరోయిన్ ప్రాధాన్యత ఉంటుంది.
దర్శి, రాహుల్ తో మళ్ళీ కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
మేము మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ పూణేలో చేశాం. అక్కడ లొకేషన్ కి దగ్గర లోని ఓ పొలంలో వసతి ఏర్పాటు చేసుకొని ముగ్గురం ఉన్నాం. దాదాపు పదిహేను రోజులు అక్కడ వున్నాం. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఆస్వాదించాం.
‘సామజవరగమన’ లా ఈ సినిమాకి పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా ?
ప్రిమియర్స్ వేయాలనే అయితే ఆలోచన వుంది.
కొత్త ప్రాజెక్ట్స్ ?
‘శ్వాగ్’ దాదాపు పూర్తయింది. దీంతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా, కోన గారితో ఒక సినిమా చేస్తున్నాను.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!