Harirama Jogaiah letter: సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి.. ముఖ్యంగా జనసేన-టీడీపీ పొత్తుకంటే మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య.. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా లేఖలు రాస్తూ వస్తున్నారు.. తాజాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోజ్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలన్నారు.. సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలు ఎంత ఉపయోగపడతాయో షణ్ముఖ వ్యూహంలోని మరికొన్ని పథకాలు అంతకుమించి ఉపయోగంగా చెప్పటానికి ఏ మాత్రం సందేహం లేదని పేర్కొన్నారు..
Read Also: Devara: కాలేమైందన్నా… దేవర ముంగిట ట్రోల్ బెల్స్!
సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన సూచించిన పథకాలు అమలు చేయాలని లేఖలో సూచించిన హరి రామజోగయ్య.. యువకులకు 10 లక్షల రూపాయలు వరకు సబ్సిడీ అందజేసే సౌభాగ్య పథకం బృహత్తరమైనది.. సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని యువత కోరుకుంటున్నారు.. సంపద చేకూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.. అందుకే సంపద కూర్చే పథకానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య.