Solar Eclipse 2025: నేడు (సెప్టెంబర్ 21) సూర్యగ్రహణం ఏర్పడనుందని జ్యోతిష్యులు వెల్లడించారు. ఈ ఏడాదికి ఇదే చివరి, అతి పెద్ద గ్రహణమని చెబుతున్నారు. వందేళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే అరుదైన ఈ ఘటనపై శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులలో చర్చలు జరుగుతుంది. అదీగాక, ఆదివారం రోజు అమావాస్య కావడంతో ఈ గ్రహణం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించనుంది. ఆ ప్రాంతాలపై ఇది పెను ప్రభావం చూపే అవకాశముందని సిద్ధాంతులు హెచ్చరిస్తున్నారు. కాగా, భారత్‌లో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించే అవకాశం లేదని జ్యోతిష్యులు స్పష్టం చేశారు.
Read Also: Bombay High Court: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వ్యతిరేక పోస్ట్.. ‘‘మెరిట్ స్టూడెంట్ అయితే ఏంటి..?’’
ఇక, భారత సమయం ప్రకారం ఈ సూర్య గ్రహణం రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, గరిష్ఠ స్థితి 1:11 గంటలకు (సెప్టెంబర్ 22 అర్థరాత్రి) చేరుకుని, 3:23 గంటలకు ముదియనుంది. మొత్తం దీర్ఘకాలం 4 గంటల 24 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉండనుంది. కాగా, ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం కావడంతో, ఖగోళ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆసక్తిగా చూడాలని అనుకుంటున్నారు. కాగా, ఈ పాక్షిక సూర్య గ్రహణం దక్షిణ అర్ధగోళంలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌లో 80 శాతం వరకు సూర్యుని మూసివేస్తుంది, స్ట్యూవర్ట్ ఐలాండ్, దక్షిణ భాగాల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతాలు, సిడ్నీ, మెల్‌బోర్న్ లాంటి నగరాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. అలాగే, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతాల్లో కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది.
Read Also: Satyareddy : “టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ‘కింగ్ బుద్ధ’తో హాలీవుడ్ ఎంట్రీ
ఇక, యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా ప్రాంతాల్లో మాత్రం కనిపించదు. కాగా, భారతదేశంలో గ్రహణం జరిగే సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు (రాత్రి సమయం). అయితే, NASA, ఈశా ఫౌండేషన్ లాంటి సంస్థల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడొచ్చు. ఈ గ్రహణం సెప్టెంబర్ ఈక్వినాక్స్ (పగలు, రాత్రి సమానంగా ఉంటాయి) తర్వాత రోజున జరగడంతో, వాతావరణ మార్పులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.