సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ తాజా ఫోటోలను షేర్ చేస్తూ తేజ్ “మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఏదైనా మార్చవచ్చు” అనే క్యాప్షన్ ను రాసుకొచ్చాడు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు కన్పించి చాలా రోజులే అవుతోంది. యాక్సిడెంట్ తరువాత తేజ్ అస్సలు బయట కన్పించట్లేదు. కానీ అప్పుడప్పుడూ ఇలా పిక్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఏదో ఒక విధంగా టచ్ లో ఉంటున్నాడు. మరి ఈ మెగా హీరో తమ మొహాన్ని ప్రేక్షకులకు ఎప్పుడు చూపిస్తాడో చూడాలి.