Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, ప్రస్తుతానికి 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్' నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ కె.పి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, సినిమా ఏదో భిన్నంగానే ఉండేలా కనిపిస్తోంది.
SDT15 ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. “రిపబ్లిక్” సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్, సుకుమార్…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ తాజా ఫోటోలను షేర్ చేస్తూ తేజ్ “మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఏదైనా మార్చవచ్చు” అనే క్యాప్షన్ ను రాసుకొచ్చాడు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు కన్పించి చాలా రోజులే అవుతోంది. యాక్సిడెంట్ తరువాత తేజ్ అస్సలు బయట కన్పించట్లేదు. కానీ…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్… ఇటీవల కాలంలో వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో కన్పించారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఆ తరువాత బయట…