బీటెక్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 184 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గేట్ 2023 స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్టోబర్ 20న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 10 లోపు PGCIL అధికారిక వెబ్‌సైట్ powergrid.inలో ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవచ్చు… అర్హతలు, పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ B.E./ B.Tech/ B.Sc (Eng.) పూర్తి చేయాలి. అభ్యర్థులు ఈ కోర్సుల్లో కనీసం 60% మార్కులు లేదా అందుకు సమానమైన CGPA సాధించాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి..సివిల్ఇంజనీర్ ట్రైనీ సెక్షన్‌లో 28 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ట్రైనీ విభాగంలో 6 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ట్రైనీ విభాగానికి 6 పోస్టులను కేటాయించారు..
ఎంపిక ప్రక్రియ..
ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో గేట్ 2023 స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో పాటు అభ్యర్థులకు బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు నార్మలైజ్డ్ స్కోర్‌ను సిద్ధం చేస్తారు. మెరిట్‌లో ఉన్న వారికి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులందరూ రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డీటేల్డ్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా ఈ ఫీజు చెల్లించాలి..ఈ నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవాలి..