చక్కటి కెరీర్ అప్షన్ ఎంపిక విద్యార్థి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కెరీర్‌లో భద్రత, స్థిరత్వంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులను ఎంచుకోవాలి. నేటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కాగానే ఉన్నత విద్య కోసం ఏ కోర్సుల్లో చేరాలనే దానిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్, ఇంజనీర్ కావాలని ఆశిస్తుంటారు.
బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో 2022-23 వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. డిగ్రీ కోర్సుల కోసం…
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన…