Doctor Cheating: మ్యాట్రిమోనీలో కలిశాడు.. నట్టేట ముంచేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు మ్యాట్రిమోనీలో కలిశాడు. తానో స్పెషలిస్ట్ డాక్టర్‌నని నమ్మించాడు. నిన్నే పెళ్లాడుతానని మాయమాటలు చెప్పాడు. ఇండియాలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నట్టు బిల్డప్పులు ఇచ్చాడు. పాపం తోడు కోసమని మ్యాట్రిమోనీలో వెతికితే, అతడిచ్చిన బిల్డప్పులకి ఆ అమ్మాయి పడిపోయింది. అతడ్ని పూర్తిగా నమ్మింది. తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని భావించిన ఘరానా మోసగాడు, అదును చూసి రూ. 19 లక్షలు దోచేశాడు. అనంతరం పత్తా లేకుండా పోయాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి, పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్.. వరుని కోసమని మాట్రిమోని వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ఆమె డీటెయిల్స్ చూసిన ఓ యువకుడు.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు యుసాన్ సియాన్ అని, నెదర్లాండులో తాను శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపాడు. వైద్య వృత్తికి చెందినవాడే కావడంతో, ఆమె అతనికి ఆకర్షితులైంది. ఫోన్ నెంబర్లు మార్చుకొని, తరచూ మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి ఎంతలా ఎట్రాక్ట్ అయ్యిందంటే, పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. అతడు కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే.. ఇండియాలో తాను కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నానని, అందుకు సహకారం కావాలని కోరాడు. సహాయం చేయడానికి తాను సిద్ధమేనని చెప్పింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కట్ చేస్తే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో అతడు ఫోన్ చేయించాడు. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని, ఆయన సెల్‌ఫోన్ మరమ్మత్తుకు గురైందని ఆమె డాక్టర్‌తో చెప్పింది. అతడు లక్ష యూరో డాలర్లు తీసుకొచ్చాడని, దాన్ని మార్చడానికి, అలాగే వారు నివాసం ఉండటానికి, ఇతర పన్నులు చెల్లించడానికి మొత్తం రూ. 19,59,920 కట్టాలని పేర్కొంది. యుసాన్ సియాన్ నేరుగా కలిసి ఆ నగదు తిరిగి ఇచ్చేస్తారని నమ్మబలికింది. ఎలాగో తనకు కాబోయే భర్తే కదా అని నమ్మి, ఆ మహిళ చెప్పినట్టు డబ్బు డిపాజిట్ చేసింది. అంతే.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈమె యుసాన్‌కి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వైద్యురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!