అతడు మ్యాట్రిమోనీలో కలిశాడు. తానో స్పెషలిస్ట్ డాక్టర్‌నని నమ్మించాడు. నిన్నే పెళ్లాడుతానని మాయమాటలు చెప్పాడు. ఇండియాలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నట్టు బిల్డప్పులు ఇచ్చాడు. పాపం తోడు కోసమని మ్యాట్రిమోనీలో వెతికితే, అతడిచ్చిన బిల్డప్పులకి ఆ అమ్మాయి పడిపోయింది. అతడ్ని పూర్తిగా నమ్మింది. తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని భావించిన ఘరానా మోసగాడు, అదును చూసి రూ. 19 లక్షలు దోచేశాడు. అనంతరం పత్తా లేకుండా పోయాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి, పోలీసుల్ని…