Crime against women: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ ముఖాన్ని సిగరేట్లతో కాలుస్తూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు. ఆ తర్వాత గొడ్డలితో నరికి హత్య చేశారు. యూపీలోని సుల్తాన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తాని మోసం చేసింది. నిందితుడు సూరజ్ కుమార్ సోంకర్‌కి ఉద్యోగం ఇప్పిస్తానని వాగ్దానం చేసింది.