Extramarital affair: ఛీ నువ్వు తల్లివేనా..? లవర్‌తో పారిపోయేందుకు కూతురి హత్య.. “క్రైమ్ పెట్రోల్” ఐడియా..
- ప్రియుడితో పారిపోయేందుకు మూడేళ్ల కూతురి హత్య..
- క్రైమ్ పెట్రోల్ చూసి హత్య చేసిన తల్లి..
- సూట్‌కేసులో పెట్టి.. ఆనవాళ్లు చెరిపేందుకు యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital affair: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ తల్లి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి, 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపింది. ప్రియుడితో వెళ్లేందుకు ఈ ఘతుకానికి పాల్పడింది. బీహార్ ముజఫర్‌పూర్‌లో సూట్‌కేస్‌లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న కాజల్ అనే మహిళ, తన భర్తను విడిచిపెట్టి ప్రియుడితో వెళ్లిపోవాలిని భావించింది. ఇందుకు అడ్డుగా ఉన్న తన కుమార్తెని పాశవికంగా హత్య చేసింది.
ప్రియుడు తన కుమార్తెతో ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. చిన్నారి గొంతు కోసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పొదల్లో పారేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాపులర్ టీవీ షో ‘‘ క్రైమ్ పెట్రోల్’’ చూసి తన కూతురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
Read Also: Bandi Sanjay-KTR: కవితకు బెయిల్ మంజూరుపై మాటల యుద్ధం.. బండి సంజయ్ vs కేటీఆర్
శనివారం ముజఫర్‌పూర్‌లోని మినాపూర్ పరిసరాల్లో రెడ్ ట్రాలీ సూట్‌కేసులో మూడేళ్ల మిస్తీ అనే బాలిక మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యని దర్యాప్తు చేసేందుకు పోలీసులు స్పెషట్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ టీములను రంపించి విచారణ వేగవంతం చేశారు. బాలిక కుటుంబంపై అనుమానంతో వారి ఇంటిని సోదా చేయగా నేలపై, సింక్, టెర్రస్‌పై రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. మిస్తీ తల్లి కాజల్ కనిపించకుండా పోయిందని, ఘటన జరిగిన రోజు భర్త మనోజ్‌కి ఫోన్ చేసి పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పిందని పోలీసులు గుర్తించారు.
మనోజ్ తన భార్య కాజల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాజల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయడంతో ఆమె తన ప్రియుడి ఇంట్లో దొరికింది. విచారణతో కాజల్‌కి వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు బిడ్డను అడ్డు తొలగించుకున్నట్లు చెప్పింది. కూతురిని తీసుకుని వెళ్లాలనుకున్నప్పటికీ ప్రియుడు దీనికి ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసింది. హత్య ఆనవాళ్లు చెరిపేసేందుకు రక్తపు మరకలను తొలగించాలని చూసింది. క్రైమ్ పెట్రోల్ షో చూసే అలవాటు ఉన్న కాజల్, ఓ ఎపిసోడ్‌లో చూసిన విధంగా బిడ్డను చంపి, సూట్‌కేస్‌లో పెట్టినట్లు తేలింది. అయితే, ఈ హత్యలో ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్లుగా, ఇందుకు అతను ప్రభావితం చేసినట్లుగా తేలలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!