Woman Gang-Ra*ped: హర్యానా ఫరీదాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న వ్యాన్‌లో 28 ఏళ్ల మహిళపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన మంగళవారం-సోమవారం మధ్య రాత్రి జరిగింది. గ్యాంగ్ రేప్ తర్వాత దారుణంగా గాయపడిన మహిళను మంగళవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన విసిరేశారు. మహిళను అపహరించిన సమయంలో ఆమె తన ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది.
తాము ఇంటి వద్ద దించుతామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. అయితే, కారు మహిళ ఇంటి మార్గంలో కాకుండా, గురుగావ్ వైపు మళ్లింది. మహిళపై సుమారు రెండున్నర గంటల పాటు వ్యాన్‌లోనే ఉంది. ఆమెపై నిందితులు అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించినప్పటికీ, నిందితులు ఆమెను బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు, మహిళను బయట విసిరేశారు. మహిళ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె తీవ్రంగా గాయపడింది.
Read Also: 10,080mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో జనవరి 5న HONOR Power2 లాంచ్..!
తీవ్రగాయాలపాలైన మహిళ, తన సోదరికి సమాచారం ఇవ్వడంతో, కుటుంబ సభ్యులు ఆమెను సంఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె ముఖానికి 10 నుంచి 12 కుట్లు వేశారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ఆ మహిళ షాక్‌లోనే ఉంది. బాధితురాలి సోదరి తన ఫిర్యాదులో, సంఘటనకు ఒక రోజు ముందు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన సోదరి తనకు ఫోన్ చేసి, తన తల్లితో గొడవ జరిగిందని, తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని పేర్కొంది. మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని కూడా తన సోదరికి చెప్పిందని తెలిపింది. బాధిత మహిళకు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాల వల్ల మహిళ, భర్తకు దూరంగా ఉంటోంది. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.