వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.పరాయి వారి మోజులో కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు.. అది భార్య అయినా భర్త అయినా.. తాజాగా ఒక భార్య తన భర్తను వదిలి ప్రేమించిన అమ్మాయితో పారిపోయింది. ఏంటీ.. అమ్మాయితోనా .. అవును మీరు విన్నది నిజమే.. ఒక యువతి తన భర్తను వదిలి మరో యువతితో జంప్ అయ్యింది. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. త్రిస్సూల్ కు చెందిన ఒక యువతికి కొద్దిరోజుల క్రితం ఒక యువకుడితో వివాహమైంది. పెళ్లైన తెల్లారే హనీమూన్ కోసం ఆ జంట బ్యాంకాక్ కి వెళ్లారు. అందమైన భార్య, చల్లటి ప్రదేశం.. ఇక రాత్రంతా జాగరమే అనుకున్న ఆ భర్తకు షాక్ ఇచ్చేలా ఆ యువతి తన ప్రేయసి అయినా మరో యువతితో జంప్ అయ్యింది. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన భార్య ఇంకా రాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు పారిపోయిన జంటను పట్టుకొని విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
కాలేజ్ చదివే రోజుల్లోనే తామిద్దరం ప్రేమించుకున్నామని.. కానీ మా పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని ఈ ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ యువతితో పాటు మరో యువతి కూడా పెళ్లైన తెల్లారే బయటికి వచ్చేసి ప్రియురాలిని కలిసింది. ఇక ఈ విషయం విన్న యువతి భర్తకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి స్వార్థం కోసం ఇద్దరు అమాయకులను మోసం చేసినందుకు పొలుసులు ఆ ఇద్దరి అమ్మాయిలను అరెస్ట్ చేశారు.