ఈమధ్యకాలంలో ప్రియుడితో యవ్వారం నడపడానికి మూడుముళ్ళు..ఏడడుగులు వేసిన భర్తను క్షణంలో వదిలించుకుంటున్నారు. సమాజంలో వివాహేతర సంబంధాలు విచక్షణను మరిచిపోయేలా చేస్తున్నాయి. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన ఘటన తెలంగాణలో సంచలనం కలిగిస్తోంది. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం ఇటుకల పహాడ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.
వలస కూలీ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఇటుకల పహాడ్ లోని అటవీశాఖ ప్లాంటేషన్ లో కూలి పనులకు కోసం వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన మడవి దేవేందర్, భార్య పార్వతి భార్యభర్తలు. వీరితో పాటు మరో కూలీ రామ్ లాల్ కూడా వీరదగ్గరకు వచ్చారు. అయితే ఆదివారం రాత్రి ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఉండడం భర్త దేవేందర్ చూసి ప్రశ్నించాడు. అయితే దేవేందర్ ను కర్రతో బాది గొంతునలిమి హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. రామ్ లాల్ కు దేవేందర్ భార్య సహకరించిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
రామ్ లాల్ సాయంతో భార్య తన భర్త దేవేందర్ ని చంపేసి పాతిపెట్టినట్టుగా దర్యాప్తులో తేలింది. తాగిన మైకంలో సహచర కూలీలతో రాంలాల్ ఈ దారుణం గురించి చెప్పడం.. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి పోస్టుమార్టం చేశారు. ఈ డెడ్ బాడీని వెలికి తీసిన తర్వాత అక్కడే పోస్ట్ మార్టం చేసారు.
ఈ దారుణం అనంతరం మృతదేహం తరలింపునకు మరో వ్యక్తి సహకరించాడని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని దీనిపై పూర్తి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఇలాంటి దారుణమయిన ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Bandi Sanjay : జఫర్ సన్ స్కాచ్ మందు కోసమే కేసీఆర్ ఢిల్లీకి పోయిండు