Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
- నంద్యాల జిల్లాలో దారుణ హత్య ఘటన
- ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య
- మృతుడు డోన్‌కు చెందిన విల్సన్‌గా గుర్తింపు
- 11 ఏళ్ల క్రితం మేరీ (రాశి)తో వివాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న కైప సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, మృతుడు డోన్‌కు చెందిన విల్సన్ గా గుర్తించారు. ఆ తర్వాత లోతుగా విచారణ జరిపి, ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల క్రితం విల్సన్ కు నంద్యాల బొగ్గు లైన్ ప్రాంతానికి చెందిన మేరీ అలియాస్ రాశితో వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా భర్త అనుమానాలు వ్యక్తం చేయడంతో, ఆమె మధు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా మారడంత, అతడిని అడ్డు తొలిగించేందుకు కుట్ర పన్నింది. ఇందుకోసం ప్లాన్ ప్రకారం.. మధు తన స్నేహితులు రఫీ, అశోక్ లతో కలిసి విల్సన్ ను డోన్ నుంచి నంద్యాలకు ఆటోలో తీసుకువెళ్తూ మధ్యలో కైప సమీపంలో ఆపారు. అక్కడ విల్సన్ మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి పరారయ్యారు.
Shane Warne-RR: షేన్ వార్న్ మాస్టర్ మైండ్.. రాజస్థాన్ రాయల్స్ నుంచి రూ.460 కోట్లు!
ఆ తర్వాత చివరికి నిందితులు కైప వీఆర్వో సమక్షంలో లొంగిపోయారు. ఈ కేసులో భార్య మేరీతో పాటు మధు, రఫీ, అశోక్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటనతో మృతుడి 10 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడు అనాథలుగా మారారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!